BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
జాతీయ జలమార్గాలు, రైల్వే కారిడార్లు, ఆరెంజ్ ఎకానమీ.. కేంద్ర బడ్జెట్లో తెలుసుకోవాల్సిన 10 ముఖ్యాంశాలు
ఈసారి వార్షిక బడ్జెట్లో తయారీ, మౌలిక వసతులు, రవాణా, ఎనర్జీ వంటి రంగాలకు ప్రాధాన్యం, అదే సమయంలో విద్య, ఆరోగ్యం, మహిళల సంక్షేమం, పర్యటక రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
పాకిస్తాన్ : ‘‘టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌తో బరిలోకి దిగం’’
"ఐసిసి టి20 ప్రపంచ కప్ 2026లో పాల్గొనడానికి పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదించింది. అయితే, ఫిబ్రవరి 15, 2026న భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మైదానంలోకి దిగదు"
ఎప్స్టీన్ ఫైల్స్: ప్రధాని మోదీ పేరు ప్రస్తావనపై విదేశాంగ శాఖ ఏం చెప్పింది, కాంగ్రెస్ వేసిన 3 ప్రశ్నలేంటి?
"జెఫ్రీ ఎప్స్టీన్ నుంచి ప్రధాని మోదీ ఎలాంటి సలహా తీసుకున్నారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏ ప్రయోజనం కలిగించేందుకు మోదీ ఇజ్రాయెల్‌లో డ్యాన్స్ చేసి పాట పాడారు? - 'ఇది పనిచేసింది'...అని ఎప్స్టీన్ రాశారు. దాని అర్థం ఏంటి?" అనే మూడు ప్రశ్నలను కాంగ్రెస్ వేసింది.
కేంద్ర బడ్జెట్ 2026: ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏవి పెరుగుతాయి?
కేంద్ర బడ్జెట్ అనగానే ఉద్యోగులు, ఆదాయపు పన్ను మినహాయింపు కోసం చూస్తే, సామాన్య ప్రజలు, గృహిణులు బడ్జెట్లో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అని చూస్తారు. కేంద్ర ఆర్థిక బడ్జెట్లో తయారీ, ఎగుమతి, గ్రీన్ ఎనర్జీకి ఉపశమనం లభించింది. మరోవైపు స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పెట్టుబడులు, లావాదేవీలపై పన్ను విధించారు.
కేంద్ర బడ్జెట్ : ఎస్‌టీటీలపై సీతారామన్ ఏం ప్రకటించారు, స్టాక్‌మార్కెట్ ఎందుకు పతనమైంది?
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్లో షేర్లు ఒక రోజులో 19.18 శాతం నష్టపోయాయి. కోవిడ్ తర్వాత ఎంసీఎక్స్ మార్కెట్లో ఈ స్థాయి పతనం నమోదు కావడం ఇదే మొదటిసారి. స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంచుతున్నట్లు ప్రకటించడం వల్లే మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయని నిపుణులు భావిస్తున్నారు.
'హిజాబ్ ధరించి రీల్స్ చేయకు’ - ఇంటర్నెట్లో పెరుగుతున్న ఇలాంటి బెదిరింపులపై బాధితులు ఏం చెబుతున్నారు?
''హిజాబ్ ధరించాలా? వద్దా? అన్నది మహిళల ఎంపిక. కానీ, హిజాబ్ ధరించు లేదా వద్దు అని మాత్రమే సమాజం ఆమెకు చెబుతుందే తప్ప, అసలు మీకు హిజాబ్ ధరించాలని ఉందా? లేదా? అని అడగదు. ఇది కేవలం ఇస్లాంలోనే కాదు. చాలా మతాల్లో ఇలానే ఉంది. మతపరమైన చిహ్నాలను, విలువలను మహిళలపై రుద్దుతున్నారు''
వీడియో, ఫుట్‌బాల్ ఆటతో బాల్యవివాహాలకు చెక్ పెట్టిన అమ్మాయిలు - ISWOTY, వ్యవధి 3,34
భారతదేశంలో పేదరికం, బాల్య వివాహాల వల్ల చాలామంది అమ్మాయిలకు క్రీడలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. కానీ ఈ అమ్మాయిలు అన్ని అడ్డంకులను అధిగమించి మైదానంలోకి అడుగుపెట్టారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వారు తమ జీవితాలను సరికొత్తగా మలచుకుంటున్నారు.
మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?
‘‘దేశ ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఎలాంటి నిరాశావాదం అవసరం లేదు. విభజన కారణంగా నిజంగానే మనం కొంత బలహీనపడ్డాం. అఖండ భారతదేశంలో అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి కంటే చాలా మెరుగ్గా ఉండేవాళ్లం’’ అని స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి షణ్ముఖం చెట్టి తన ప్రసంగంలో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్: 'తిరుమల లడ్డూ'పై ఫ్లెక్సీ నుంచి.. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు వరకు.. అసలేం జరిగింది?
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబును అభ్యంతరకర పదజాలంతో దూషించిన నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదం పై తెలుగుదేశం ఫ్లెక్సీతో మొదలైన వివాదం అంబటి అరెస్టు దాకా సాగింది. అసలు గుంటూరులో ఏం జరిగింది?
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
షార్ట్ వీడియోలు
ఫీచర్లు
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
రహమాన్ డకైత్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
భూతకోల: ఏమిటీ ఆచారం, బయటి ప్రాంతాలలో దీనిని ప్రదర్శించకూడదా?
బయటివారికి ఇదొక వేషంలా కనిపిస్తుంది కానీ, తుళు ప్రజలకు మాత్రం ఆ రూపం దైవం. అందుకే బయట ప్రాంతాల్లో దీన్ని ప్రదర్శించడానికి వారు ఇష్టపడరు. వేషంగా వేసుకుంటే సహించరు. భక్తితో పాటు భయం ఉంచడం కూడా లక్ష్యం అంటారు.
తెలుగుప్రజలు అరుణాచలానికి ఎక్కువగా ఎందుకు వెళతారు?
18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.

























































