ఫుట్‌బాల్ ఆటతో బాల్యవివాహాలకు చెక్ పెట్టిన అమ్మాయిలు - ISWOTY
భారత్‌లో లక్షల మంది బాలికలకు బాల్య వివాహాలు చేస్తుండటంతో, వారు తమ కలలను సాకారం చేసుకోలేకపోతున్నారు. కానీ, ఈ బాలికలు క్రీడల్లో రాణిస్తూ, ఊహలకే పరిమితమైన తమ కలలను నెరవేర్చుకునేలా తమను తాము మలుచుకుంటూ, గర్వించే స్థాయికి ఎదుగుతున్నారు.
తనకు జరగాల్సిన బాల్య వివాహాన్ని అడ్డుకునేందుకు ఫుట్‌బాల్ మున్నాకు సాయపడింది. ఇప్పుడు ఆమె కోచ్‌గా ఎదిగింది. ఇప్పుడు మిగిలిన బాలికలు కూడా ఈ ఆటల ద్వారా తమ స్వేచ్ఛను పొందేలా ఆమె సాయం చేస్తోంది.
మున్నా కూడా బాల్య వివాహ బాధితురాలిగా మారాల్సి ఉండేది. కానీ, ఓ మహిళా హక్కుల సంస్థ ఆమెకు ఫుట్‌బాల్‌ను పరిచయం చేసింది. ఈ 'ఫుట్‌బాల్ ఫర్ ఫ్రీడం' ప్రాజెక్టు గత దశాబ్ద కాలంలో రాజస్థాన్‌లోని 13 గ్రామాల్లో 800 మందికి పైగా అమ్మాయిలకు శిక్షణ ఇచ్చింది. ఇందులో వారికి క్రీడలను మాత్రమే కాకుండా మరిన్ని విషయాలను నేర్పిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









